తెలుగు వెలుగు టీవీ - వార్తలు / దమ్మపేట : దమ్మపేటలో 5 క్వింటాళ్ల గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా గంజాయి పట్టుబడిన వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. అచ్చుతాపురం క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై సాయి కిషోర్ రెడ్డి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అక్కడికి వచ్చిన ఓ లారీలో తనిఖీలు చేయడంతో గంజాయి పట్టుబడినట్లు చెప్పారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 1,77,99,500 ఉంటుందన్నారు. ఆరుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ