తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 11 తెలుగు వెలుగు ) రాష్ట ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దరఖాస్తులు చేసుకొని , కార్యాలయాల్లో కొత్త పెన్షన్ల మంజూరు కోసం వేలాది మంది అర్హులైన వృద్ధులు వితంతువులు,వికలాంగులు దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారని అన్నారు.అనేకమంది భర్తను కోల్పోయిన వితంతువులు ఏ ఆసరా లేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుందని ఆశతో ఎదురు చూస్తుంటే రెండేళ్లు కావస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ గురించి మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో పెన్షన్ పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్ దారులకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చక ఓటమి పొందారని వారిలా కాకుండా అర్హులైన నిరుపేదలకు తక్షణమే కాంగ్రెస్ పార్టీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు
Admin
తెలుగు వెలుగు టీవీ