తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. శనివారం నిర్వహించిన ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ ఉత్కంఠభరితంగా సాగగా, విజయం సాధించిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన ఫ్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో విద్యా భారతి జట్టుపై పంజాబ్ జట్టు 57–56తో విజయం సాధించింది. రెండో మ్యాచులో కేరళపై తెలంగాణ జట్టు 62–44తో గెలుపొందింది. మూడో మ్యాచులో ఆంధ్రప్రదేశ్‌పై ఉత్తరప్రదేశ్ జట్టు 70–44తో విజయం సాధించింది. నాలుగో మ్యాచులో గుజరాత్‌పై పుదుచ్చేరి జట్టు 49–44తో గెలిచింది. ఐదో మ్యాచులో మణిపూర్‌పై రాజస్థాన్ జట్టు 55–37తో విజయం సాధించింది. ఆరో మ్యాచులో సీబీఎస్‌ఈపై కర్ణాటక జట్టు 63–44తో గెలుపొందింది. ఏడో మ్యాచులో మధ్యప్రదేశ్‌పై హర్యానా జట్టు 67–33తో విజయం సాధించింది. ఎనిమిదో మ్యాచులో మహారాష్ట్రపై తమిళనాడు జట్టు 53–40తో గెలిచింది.మధ్యాహ్నం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచుల్లో పంజాబ్‌పై తెలంగాణ జట్టు 68–46తో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. పుదుచ్చేరిపై ఉత్తరప్రదేశ్ జట్టు 69–45తో గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. తమిళనాడుపై హర్యానా జట్టు 51–50తో స్వల్ప తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది.ఆదివారం సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ