తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 28న కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కబడ్డీ పోటీల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కబడ్డీ పోటీలు ఈనెల 28, 29, 30 తేదీల్లో జరుగుతాయని వెల్లడించారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర రావు, ఆళ్ళ మురళి, పెదబాబు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ