Wednesday, 16 September 2026 04:23:29 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

జాతీయ రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు అవసరం. రాజమార్గానికిసేవా, అనుసంధాన మార్గాలు నిర్మించండి.సీఎం రేవంత్ ని కోరిన మంత్రి తుమ్మల

Date : 22 September 2025 06:53 PM Views : 397

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రధాన సమస్యలపై సీఎంకు మంత్రి తుమ్మల లేఖ.రహదారుల అవసరాల దృష్ట్యా ప్రాధాన్యత కల్పించండి.ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్డు కల్పించండి. •ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు 7 కిమీటర్ల అనుసందానించాలి.జగ్గయ్యపేట కొత్తగూడెం నేషనల్ హైవే మంజూరుకు మంత్రి వినతి.రహదారుల నిర్మాణంతో పరిశ్రమలు, పర్యాటక రంగం అభివృద్ధి. కలెక్టర్లు నేషనల్ హైవే అధికారుల తో సమీక్షలో సీఎం రేవంత్ ను లేఖ ద్వారా కోరిన తుమ్మల.జిల్లాలో జాతీయ రహదారి అభివృద్ధి, అనుసంధాన రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాలో రవాణా సౌకర్యాల మెరుగుదల,పారిశ్రామిక పురోగతికి రహదారుల విస్తరణ, అనుసంధానంతో సాధ్యమవుతుందని తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లు, నేషనల్ హైవే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో లేఖ ద్వారా ఈ అంశాలను తుమ్మల ప్రస్తావించారు. రహదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు మంత్రి తుమ్మల లేఖలను అందించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను వారికి వివరించారు.ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే (జాతీయ రహదారి)కి ఖమ్మం నియోజకవర్గ పరిధిలో రెండు వైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు పూర్తి అయ్యేలా ఖమ్మం - కొరివి రోడ్డు నుండి నూతన కలెక్టరేట్ (అమరావతి నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే) వరకు7 కిలోమీటర్ల రహదారిని. రింగ్ రోడ్ కు అనుసంధానంగా తక్షణం మంజూరు చేయాలని సీఎంను కోరారు. జగ్గయ్యపేట–కొత్తగూడెం వయా బోనకల్, వైరా, తల్లాడ నేషనల్ హైవే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ కేంద్రానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రహదారులు పూర్తి చేస్తే ఖమ్మం జిల్లాలో పరిశ్రమలకు, వాణిజ్యానికి, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రాచలం, పాల్వంచ, మణుగూరు, అశ్వాపురం వంటి పారిశ్రామిక పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామాలయం కొత్త శోభ సంతరించుకొని ఉందని పేర్కొన్నారు.అలాగే పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు సులభంగా అనుసంధానమవుతాయని పేర్కొన్నారు. దీంతో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా సారపాక నుండి కాలేశ్వరం వరకు వయ అశ్వాపురం.ఎటూరి నాగారం జాతీయ రహదారిని మంజూరు చేయాలని. బూర్గంపాడు నుండి జంగారెడ్డిగూడెం వరకు వయ ములకలపల్లి. దమ్మపేట వరకు నూతన జాతీయ రహదారిని మంజూరు చెయ్యాలని కోరినారు. రహదారుల విస్తరణ, బైపాస్ అనుసంధానం, కొత్త నేషనల్ హైవే మంజూరుపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల కోరారు. ప్రజా రవాణా, పరిశ్రమలు, పర్యాటక రంగాల అభివృద్ధి కోసం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ కేంద్రానికి పంపితేనే ప్రాంతీయ ప్రజలు నిజమైన లాభం పొందుతారని మంత్రి అభిప్రాయపడ్డారు.రహదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ తక్షణ ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :