Thursday, 17 September 2026 04:44:25 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 19 December 2025 07:40 PM Views : 307

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వరదలు, పరిశ్రమ ప్రమాదాల నియంత్రణపై ఎన్‌డిఎంఏ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.వరదలు, పరిశ్రమలలో సంభవించే ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధించి జిల్లాల్లో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మాక్ ఎక్సర్సైజ్‌లు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఏ) ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, ఎన్‌డిఎంఏ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులకు వరదలు, పరిశ్రమ ప్రమాదాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వీడియో అవగాహన సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మలతో కలిసి ఐ డి ఓ సి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మరియు ఎన్‌డిఎంఏ అధికారులు మాట్లాడుతూ, జిల్లాలలో వరదలు లేదా పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు అధికార యంత్రాంగం వేగంగా, సమన్వయంతో స్పందించేందుకు ముందస్తు సిద్ధత ఎంతో అవసరమని తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో విపత్తుల నిర్వహణకు సంబంధించిన మాక్ ఎక్సర్సైజ్‌లు నిర్వహించి, అందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే సమీక్షించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు మాట్లాడుతూ , ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా తక్కువ సమయంలో భారీ వర్షాలు కురిసి ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయని, వీటి వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వరదల సమయంలో ప్రజలకు సకాలంలో సహాయం, పునరావాసం, పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళికాబద్ధంగా సిద్ధంగా ఉండాలని తెలిపారు. అలాగే పరిశ్రమ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు పాటించాల్సిన ప్రామాణిక విధానాలపై (ఎస్.ఓ.పి.) స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి పరిశ్రమలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ , గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు సంభవించినప్పుడు జిల్లాలో చేపడుతున్న ముందస్తు మరియు తక్షణ చర్యలను వివరించారు. వరదల అంచనాల విధానం, ముందస్తు హెచ్చరికల జారీ, కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, పునరావాస కేంద్రాల నిర్వహణ, లోతట్టు ప్రాంతాలలో శాశ్వత పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ అధికారులకు వివరించారు.అనంతరం కలెక్టర్ అధికారులకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సూచనలు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వరదలు, పరిశ్రమలలో సంభవించే భారీ ప్రమాదాల సమయంలో అధికార యంత్రాంగం సమన్వయంతో స్పందించేలా మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, మిషన్ భగీరథ ఈఈ నలిని, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు, ఇరిగేషన్ ఈజీ అర్జున్ రావు, ఆర్ అండ్ బి శాఖ ఈఈ నాగేశ్వరరావు, డి సెక్షన్ సూపర్డెంట్ వెంకటేశ్వర్లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :