Friday, 18 September 2026 04:17:39 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

భద్రాచలంలో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి - జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 04 September 2025 04:27 PM Views : 424

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచల పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా, శాంతియుతంగా, సురక్షితంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి నది తీర ప్రాంతంలో నిమజ్జన ఘాట్‌ల వద్ద లాంచీలు బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీరు, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లు వంటి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. నదీ తీర ప్రాంతంలో ఎటువంటి అపశృతి జరగకుండా విస్తృత భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ భక్తులకు, గణేశ మండపాల నిర్వాహకులకు ముఖ్య సూచనలు చేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపులో భక్తులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, పెద్ద సంఖ్యలో గుంపులు ఏర్పడి అల్లర్లు చేయకుండా శాంతియుతంగా ఊరేగింపులు నిర్వహించాలన్నారు. ఊరేగింపుల సమయంలో డీజేలు, అధిక శబ్దపూరిత మ్యూజిక్ వాడకూడదని, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకుండా మున్సిపల్, పోలీస్ శాఖల సూచనల మేరకు మాత్రమే ఊరేగింపులు కొనసాగించాలన్నారు. నిర్దేశించిన ప్రదేశాలలోనే వినాయక నిమజ్జనం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాహనాలను నిర్దిష్ట పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు నదీ ఘాట్ ప్రాంతంలో జాగ్రత్తలు పాటించాలని భక్తులకు సూచించారు. మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమాలకు రాకూడదని, విగ్రహాల నిమజ్జనం క్రమపద్ధతిలో జరగాలని ఆయన హెచ్చరించారు. జిల్లా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో, శాంతియుతంగా వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :