తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛధనం- పచ్చదనం రెండవ రోజు కార్యక్రమం పదో వార్డులో కౌన్సిలర్ మునిగడప పద్మ పార పట్టి శ్రమదానంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన పరిసర ప్రాంతాలను మనమే శ్రమదానంతో శుభ్రపరుచుకొని ,ఆరోగ్య రక్షణ, సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ చమన్ వెనుక లక్ష్మీ టాకీస్ ఏరియాలో డ్వాక్రా గ్రూప్ మహిళలు, యువకులు శ్రమదానంలో పాల్గొని, రామవరం మార్కెట్ ఏరియాలో అలాగే లక్ష్మీ టాకీస్కు వెళ్లే దారిలో కిన్నెరసాని పైప్ లైన్ లీకేజీలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ స్పెషలాఫీసర్ రామ్మూర్తి, వార్డు నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, ఆర్ పి మేడిపల్లి కవిత ,అంగన్వాడీ టీచర్స్ సరోజ, నీలవేణి, మున్సిపల్ సిబ్బంది, వార్డు యూత్ నాయకులు, డ్వాక్రా గ్రూప్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ