తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ( ) మే నెల ఒకటో తేదీ నుండి 31 తేదీ వరకు 3 ఇంక్లైన్ లో నెలరోజుల పాటు నిర్వహించే రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరాన్ని తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని టీపీసీసీ సభ్యులు, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నాగా సీతారాములు గురువారం సందర్శించారు. క్రీడా ప్రాంగణానికి కావలసిన సదుపాయాలు వేసవి శిక్షణలో పాల్గొనే బాల, బాలికలకు కావలసిన క్రీడా పరికరాలు పలు అంశాల గురించి నాగా సీతారాములు శిక్షకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన బాల, బాలిలకు శిక్షణలో కావలసిన అవసరాల గురించి గ్రౌండ్ లో మెరుగైన వసతుల కోసం జిల్లా క్రీడా అధికారి ఏం పరందామ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దృష్టికి తీసుకెళ్తానని, ఇప్పటికే కలెక్టర్ జిల్లాలోని క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని వారి చొరవతో రెజ్లింగ్ శిక్షణ మ్యాట్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందని అవి త్వరలోనే వేసవి శిక్షణ శిబిరానికి అందే అవకాశం ఉందన్నారు. మే 1 నుండి ప్రారంభంకానున్న రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరంలో బాల, బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని నాగా సీతారాములు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి కాశీ హుస్సేన్, ఉపాధ్యక్షులు ఐ ఆదినారాయణ, కోచ్ లు టీ తరుణ్, పి నిహారిక, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా, ఓబిసి కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు జయప్రకాష్, ఓబీసీ నాయకులు బొబ్బలు వెంకట్ యాదవ్, సోషల్ మీడియా సాయి చంద్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ