తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని సబ్జెక్టులు పిల్లలు ఎటువంటి భయాందోళనలో పెట్టుకోకుండా పరీక్షలు రాసేలా సంబంధిత ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సంబంధిత ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం నాడు కొత్తగూడెంలోని పీఎంహెచ్ మరియు పాల్వంచలోని ఏ జి హెచ్ ఎస్, రామవరం లోని పాలిటెక్నిక్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున ఉదయము సాయంత్రం స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని, పరీక్షలు అయిపోయే వరకు విద్యార్థినీ విద్యార్థులను ఎవరిని ఇండ్లకు పంపకూడదని, డ్రాప్ అవుట్ పిల్లలు ఎవరైనా ఉంటే వెంటనే వారిని పాఠశాలలకు తీసుకొని రావాలని అందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. పిల్లలు ఎక్కువ శాతం తెలుగు సబ్జెక్టులలో ఫెయిలవుతున్నారని సంబంధిత సబ్జెక్టు టీచర్లు తెలుగు సబ్జెక్ట్ చదవడంలో ఎవరైనా వెనుకబడి ఉంటే వారిపై దృష్టి సారించాలని, పదో తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఎటువంటి మనసులో భయాలు పెట్టుకోకుండా బాగా చదువుకొని పరీక్షలు బాగా రాసి అత్యుత్తమ మార్కులతో పాస్ కావాలని, అనంతరం పరిసరాలు మరియు స్టోర్ రూమ్ పరిశీలించి పిల్లలకు మెనూ ప్రకారం సమయానుకూలంగా అల్పాహారంతో మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు అందజేయాలని, స్టడీ అవర్స్ నిర్వహణలో ఉపాధ్యాయులు అలసత్వం వహించకూడదని, సంబంధిత హెచ్ఎం ప్రతిరోజు పిల్లలు చదువుతున్న సబ్జెక్టులను పరిశీలించాలని అన్నారు. రామవరం లోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను కలిసి భవిష్యత్తులో ఏం కావాలని అనుకోని కోరి తీసుకున్న సబ్జెక్టులను బాగా ప్రాక్టికల్ చేసి అనుకున్నది సాధించే వరకు విశ్రమించకూడదని అన్నారు. అనంతరం విద్యార్థినీలు ఆడుతున్న చెస్ గేమ్ ను పరిశీలించి చదువుతోపాటు వారికి ఇష్టమైన క్రీడలలో ఆడుకొని నైపుణ్యాలు సాధించేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఏ టి డి ఓ చంద్రమోహన్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది.
Admin
తెలుగు వెలుగు టీవీ