Wednesday, 16 September 2026 02:02:53 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Date : 04 August 2025 06:18 PM Views : 1038

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కరకగూడెంలోని కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా కలెక్టర్ పాఠశాల లోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, వంటగది మరియు మరుగుదొడ్లను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులతో మమేకమై వారికి అందుతున్న సదుపాయాలు విద్య బోధన ఏమైనా సమస్యలు ఉన్నాయా? మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో బాలికలకు సమగ్ర విద్యను అందించడంలో కస్తూరిబా బాలికల విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన వసతులు, భద్రతా ప్రమాణాలు, ఆరోగ్యకరమైన ఆహారం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రతి విద్యార్థి చదువులో ఉన్నత స్థాయికి చేరేందుకు అవసరమైన పరిసర వాతావరణం పాఠశాలలో ఉండాలి. మౌలిక వసతుల కల్పనలో రాజీ ఉండరాదు కలెక్టర్ స్పష్టం చేశారు.పరిసరాలు పరిశుభ్రత తప్పకుండా పాటించాలి. మరియు విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం అందించాలి అని ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు.పాఠశాల ఆవరణలో మునగ, కరివేపాకు, ఉసిరి మొక్కలను విస్తృతంగా నాటాలన్నారు. విద్యార్థులకు ఔషధ మొక్కలు పై అవగాహన కల్పించాలని అన్నారు.పాఠశాలల్లో మురుగునీరు బయటకు వెళ్లేందుకు వీలుగా డ్రైనేజీ నిర్మించాలని దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని కలెక్టర్ దృష్టికి ఉపాధ్యాయులు తీసుకురాగా డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం కలెక్టర్ కరకగూడెంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాలలో ఏర్పాటుచేసిన తరగతి గదిలు, మరుగుదొడ్లు ఇతర మౌలిక సదుపాయాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యత్యా సంవత్సరంలో నవోదయ పాఠశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.పరిశీలనలో కలెక్టర్ వెంట మండల విద్యాశాఖ అధికారి మంజుల, తాసిల్దార్ ఘంటా ప్రతాప్, డిప్యూటీ తాసిల్దార్ కాంతారావు, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, ఆర్ ఐ కృష్ణ ప్రసాద్ మరియు ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :