Saturday, 19 September 2026 09:59:09 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

మణుగూరు మనుగడ కోసం రాజీలేని పోరాటం, ఫలించిన ఎఐటీయూసీ ఉద్యమం

Date : 03 August 2026 04:42 PM Views : 163

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎఐటియుసి నాయకుల అరెస్టులు, ఆందోళనలు, నిరంతర పోరాటం,చివరకు సింగరేణికే పీకే–2 డీప్ సైడ్ బ్లాక్. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్లను తిప్పికొట్టిన ఎఐటీయూసీ సింగరేణికి దక్కిన పీకే–2 డీప్ సైడ్ బ్లాక్. మణుగూరు పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాకు వేలంపాటలో జెన్కో, సింగరేణి సంస్థలు పోటీ పడగా, చివరకు 6.5 శాతం రెవెన్యూ షేర్‌తో సింగరేణి దక్కించుకోవడం గుర్తింపు సంఘం ఎఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాలు, ఉద్యమాలు, కార్మికుల ఐక్యస్ఫూర్తికి దక్కిన ఘన విజయమని సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ పేర్కొన్నారు.సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ,మణుగూరు పీకే-2 డీప్ సైడ్ బొగ్గు బ్లాకు విషయంలో జెన్కోను వేలంపాట ప్రక్రియ నుంచి తప్పించాలని ఉద్యమం చేసిన ఏకైక కార్మిక సంఘం ఎఐటియుసి అన్నారు,అంలదేవిధంగా సింగరేణి మాత్రమే వేలంపాటలో పాల్గొనేలా చేసి బ్లాకును సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేసింది, మరియు మణుగూరు పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, గనుల వద్ద ఆందోళనలు, వినతిపత్రాల సమర్పణ, నిరసన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, అరెస్టులను సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించామని గుర్తు చేశారు.ఆ ఉద్యమాల ఫలితంగానే నేడు సింగరేణి వేలంలో పాల్గొని 6.5 శాతం రెవెన్యూ షేర్‌తో మణుగూరు పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను దక్కించుకుందని తెలిపారు. ఈ విజయానికి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు, ఎఐటీయూసీ చేపట్టిన ఉద్యమాలు కీలకంగా దోహదపడ్డాయని పేర్కొన్నారు.పీకే–2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణి మనుగడకు ప్రాణాధారమని, వేలాది మంది కార్మికుల ఉపాధి, మణుగూరు ప్రాంత అభివృద్ధి, సింగరేణి సంస్థ భవిష్యత్తు ఈ బ్లాక్‌పైనే ఆధారపడి ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో మణుగూరు బ్లాక్‌ను జెన్‌కో పేరుతో వేలంలో ప్రవేశపెట్టి, చివరకు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు జరిగిన ప్రయత్నాలను ఎఐటీయూసీ తీవ్రంగా ప్రతిఘటించిందన్నారు "జెన్‌కో కాదు.సింగరేణికే మణుగూరు డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ కేటాయించాలి" అనే నినాదంతో చేపట్టిన ఉద్యమం చివరకు విజయాన్ని సాధించిందని తెలిపారు."సేవ్ సింగరేణి – సేవ్ మణుగూరు" నినాదంతో సాగిన ఈ ఉద్యమం కార్మికుల ఐక్యతకు, సంకల్పానికి ప్రతీకగా నిలిచిందన్నారు.జెన్‌కోపై పైచేయి సాధిస్తూ సింగరేణి 6.5 శాతం రెవెన్యూ షేర్‌తో పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను దక్కించుకోవడం ఎఐటీయూసీ ఉద్యమ చరిత్రలో మరో చిరస్మరణీయ విజయమని వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్ స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :