తెలుగు వెలుగు టీవీ - వార్తలు / V.M బంజర : ఖమ్మం జిల్లా వి ఎం బంజర ఆగస్టు 15 (తెలుగు వెలుగు ) ఈరోజు తెల్లవారుజామున ఖమ్మం జిల్లా వి యం బంజర మండలం కొత్త లంకపల్లి గ్రామం వద్ద జరిగిన లారీ యాక్సిడెంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన పంది రాయమల్లు (76) అనే వ్యక్తి మృతి చెందారు SRLT కంపెనీ కి చెందిన TS 20 T 1719 నెంబర్ కల లారీ సత్తుపల్లి నుండి రుద్రంపూర్ RCSP కి బొగ్గు లోడ్ తో వస్తుండగా కొత్త లంకపల్లి గ్రామం వద్ద ఆగి ఉన్న లారీ ని గుద్దడంతో లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన రాయమల్లు అక్కడికక్కడే మృతి చెందారు సింగరేణి రెస్క్యూ టీం ఎంతో శ్రమకోర్చి మృతదేహన్ని వెలికితీశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ