తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 14 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు అన్ని వర్గాల వారు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు అని ప్రజలందరూ కూడా తెలంగాణలో బిజెపి అధికారంలో రావాలని కోరుకుంటున్నారు అన్నారు, రాష్ట్రంలో జరిగే మూడు ఎమ్మెల్సీలు కూడా బిజెపి అభ్యర్థులు గెలుస్తారు, కావున బిజెపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని పులి సర్వోత్తమరెడ్డిని మొదటి ప్రాధాన్య ఓటుతో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం అని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, జిల్లా నాయకులు తెల్లం నరసింహారావు,నున్న రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, బిజెపి మండల కార్యదర్శి భూక్య రమేష్, సిరిపురపు గోపాల్ రావు, నర్వనేని కృష్ణ, పురేటి వెంకటేశ్వర్లు, పుల్లారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ