Tuesday, 03 November 2026 07:50:14 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

Date : 06 January 2026 05:15 PM Views : 397

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలేవి!!?? లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ బిసి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడమే కాకుండా గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.ఇసుక లోడ్ చేస్తుండగా ప్రమాదానికి గురై జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చుంచుపల్లి తండాకు చెందిన అజ్మీరా పద్మను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అనుమతులు లేకుండా విచ్చల విడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడని విమర్శించారు.గిరిజన మహిళకు ప్రమాదం జరిగి,కాలు ఎముక రెండు చోట్ల విరిగి వారం రోజులు కావస్తున్నా మహిళకు మెరుగైన వైద్యం అందించకుండా అధికార పార్టీ అండదండలతో మహిళను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చేతులు దులుపుకున్నారని ఇది సరైంది కాదన్నారు.జిల్లా కేంద్రంలో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా,ఎక్కడ పడితే అక్కడ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసుకుంటున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.అధికారులు వెంటనే స్పందించి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడటమే కాకుండా గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన సదరు వ్యక్తిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,అదేవిధంగా గిరిజన మహిళకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, అంతేకాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అజ్మీరా రాములు,శివ,ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :