తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారీ వర్షాల కారణంగా రామవరం మాతా శిశు ఆసుపత్రికి రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి నుండి ఆసుపత్రిలోకి ప్రవేశించే మార్గంలో గల గుంటివాగుకు వరద ఉధృతి పెరిగింది. గుంటి వాగు వరద ఉధృతి కారణంగా అటు ఆసుపత్రిలోని రోగులు బయటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆసుపత్రిలో చేరడానికి వచ్చేవారు, వైద్య పారిశుద్ధ్య సిబ్బంది లోపలికి వెళ్లే మార్గం లేక ఆందోళన చెందుతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ