తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు కొత్తగూడెం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నేతాజీ రామవరం క్యాంపస్ లో ఉన్న 100 మంది విద్యార్ధులకు నిర్మించబడిన హాస్టల్ భవనంను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ హాస్టల్ భవనం ను ఉపయోగించుకొనుటకు అవకాశాలను పరిశీలించి, ప్రతిపాదనలుసమర్పించాలని BC వెల్ఫేర్ మరియు ఎస్సీ వెల్ఫేర్ అధికారులను ఆదేశించడం జరిగినది. అదేవిదంగా వాటికనుగుణంగా ఇంజనీరింగ్ విభాగం వారు అంచనా లను రూపొందించాలని ఆదేశించారు. తదుపరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నేతాజీ రామవరం ను కూడా పరిశీలించి అక్కడి భవనం లను వెంటనే మరమ్మత్తులు చేసే విధంగా ప్రపోజల్ ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తరగతి గదిలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, వారి నోట్ బుక్స్ ను పరిశీలించారు. పాఠశాలకు కావలసిన చిన్న చిన్న మరమ్మత్తులను స్కూల్ గ్రాంటు ను వినియోగించుకొని చేయించు కోవాలని, పాఠశాల పరిశుభ్రతను మరియు మొక్కల పెంపకాన్ని AAPC స్వచ్ఛ మిత్రలతో ఎప్పటికప్పుడు చేయించాలని ప్రధానోపాధ్యాయురాలికి సూచించారు. అదేవిధంగా ఉన్నత పాఠశాల యొక్క స్థలమునకు సంబంధించిన హద్దులను నిర్ధారించి పెన్సింగ్ ఏర్పాటు చేసేలా చూడాలని కొత్తగూడెం తాసిల్దార్ కి సూచించారు. ఈ సందర్శనలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి శ్రీలత , BC గురుకుల RCO రాంబాబు, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు సతీష్ కుమార్, సైదులు, TGWIDC ఇంజనీర్లు చారి, రాజగోపాల్ ప్రధానోపాధ్యాయురాలు ద్రౌపది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ