Thursday, 05 November 2026 11:04:40 PM
# ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి. # స్మశానవాటికల పరిశుభ్రతకు మేయర్ గణేష్ ఆదేశం. # గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు ముమ్మరం చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు

మత్తుకు బానిసలయితే భవిష్యత్తు అంధకారం. ఎస్పీ రోహిత్ రాజు.

Date : 12 March 2026 07:31 PM Views : 403

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి పోలీసులు,Eagle team హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో చాతకొండ రోడ్డులోని SS కన్వెన్షన్ ఫంక్షన్ హాలు నందు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో భాగంగా డ్రగ్స్ వినియోగంపై అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 700 మందికి పైగా విద్యార్థినీ,విద్యార్థులు,స్థానికులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.ముందుగా కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ ఎస్పీకి స్వాగతం పలికారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలయితే ఎవరి భవిష్యత్తయినా అంధకారం అవుతుందని అన్నారు.ముఖ్యంగా విద్యార్థి దశ నుండే లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ లక్ష్యాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరు కష్టపడి చదువుకోవాలని సూచించారు.తల్లిదండ్రులు తమ పిల్లల దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ప్రస్తుత పరిస్థితులలో గంజాయి వంటి మహమ్మారిని అరికట్టడంలో జిల్లా పోలీసు శాఖ విశేష కృషిని అందిస్తుందని తెలిపారు.గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు సుమారుగా 6500 కేజీల గంజాయిని అక్రమ రవాణా చేస్తుండగా దేశంలోనే అత్యధికంగా జిల్లా పోలీసులు సీజ్ చేయడం జరిగిందన్నారు.గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన నేరస్తులపై పీడియాక్టులను నమోదు చేయడమే కాకుండా వారి ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతుందని తెలిపారు.యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని,ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకుని,తమ ప్రాంతానికి,తల్లీదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాల గురించిన వీడియోలను ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ డ్రగ్స్ వినియోగం-అనార్ధాల కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,ఫారెస్ట్ డివిజనల్ అధికారి కోటేశ్వరరావు,ఎక్సయిజ్ అడిషనల్ ఎస్పీ కరంచంద్,మండల విద్యాధికారి కృష్ణయ్య,ఈగల్ టీం ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,లక్ష్మిదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :