Saturday, 19 September 2026 05:55:01 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

మణుగూరు పీకే బ్లాక్ సింగరేణికి దక్కడం హర్షణీయం : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 03 August 2026 05:41 PM Views : 147

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐక్య పోరాటాలతోనే బొగ్గు గనుల ప్రైవేటీకరణకు అడ్డుకట్ట సంస్థ మనుగడ, కార్మికుల భవిష్యత్తు కోసం నిరంతర కృషి కొత్త బొగ్గు బ్లాకుల సాధనకు ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు మణుగూరు పీకేఓసి డిప్ సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకే కేటాయించడం ప్రభుత్వంపై తాను చేసిన వత్తిడి, కార్మికుల ఐక్య పోరాటాల ఫలితమేనని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి గుర్తింపుసంఘం గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పీకేఓసి డిప్ సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు అప్పగిస్తూ నిర్ణయం జరగడంపట్ల అయన హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి పరిరక్షణ కోసం, సంస్థ మనుగడ కోసం చేపట్టిన వరుస ఆందోళనల వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని పేర్కొన్నారు. పీకేఓసి డిప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికి దక్కేలా చూసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో పలుమార్లు చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అలాగే సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన దశలవారీ ఉద్యమాలు, ఆందోళనలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునేందుకు కార్మిక లోకం ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి ఆస్తులను, గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు జరిగిన కుట్రలను ఉద్యమ స్పూర్తితో తిప్పికొట్టామని స్పష్టం చేశారు. లాభాల బాటలో ఉన్న సింగరేణిని దెబ్బతీసే యత్నాలను ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఈ విజయాన్ని కొందరు తమ గొప్పగా ప్రచారం చేసుకోవడం తీవ్ర హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు దక్కే వరకు తమ పోరాటం ఆగేది లేదని, సంస్థ ప్రయోజనాల కోసం నిరంతరం శ్రమిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. మణుగూరులో ఏఐటీయూసీ, సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన పోరాట దృశ్యాలు (ఫైల్ ఫోటోలు పంపుతున్నాము..గమనించగలరు)

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :