తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ నవభారత్ మైనింగ్ కళాశాల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న ఓ లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్ లారీ కిందకు దూసుకుపోవడంతో కారులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ