Friday, 18 September 2026 03:09:05 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత, వేగం పై జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రత్యేక దృష్టి

Date : 15 April 2026 02:13 PM Views : 230

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలు – గడువులోపు పూర్తి చేయాలని ఆదేశాలు సుజాతానగర్ మండలం మర్రి తండ గ్రామంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం సమగ్రంగా పరిశీలించారు. గ్రామంలో మొత్తం 99 ఇళ్లకు అనుమతులు మంజూరు కాగా, అందులో 65 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లను ప్రత్యక్షంగా సందర్శించి నిర్మాణ నాణ్యత, పనుల పురోగతిని సవివరంగా పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ఇప్పటివరకు జరిగిన వ్యయం, ప్రభుత్వం నుండి విడుదలైన నిధులు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లేబర్ చార్జీలు ఎంత అవుతున్నాయి, అదనంగా లబ్ధిదారులు ఎంత మొత్తం వెచ్చిస్తున్నారు వంటి అంశాలపై ప్రశ్నించి సమగ్ర సమాచారం సేకరించారు. ఈ క్రమంలో మూడ్ మౌనిక, హాథిరాం, భూక్య అమల, భూక్య సునీత, భూక్య పంతులీ తదితర లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో సుమారు 650 మంది జనాభా ఉండగా, వారిలో అధిక సంఖ్యలో తాపీ మేస్త్రీలు ఉన్నారని కలెక్టర్ గమనించారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి అదనంగా లబ్ధిదారులు స్వంతంగా పెట్టుబడి పెట్టి, తామే స్వయంగా ఇళ్ల నిర్మాణంలో పాల్గొనడం ద్వారా లేబర్ ఖర్చులను తగ్గించుకుంటూ ఇళ్లను నిర్మించుకుంటున్న విషయాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనల ప్రకారం జరుగుతోందో లేదో అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఇళ్ల విస్తీర్ణం, నిర్మాణ పరిమాణాన్ని అధికారులతో టేప్‌తో కొలిపించి నిర్ధారించారు. ఎలాంటి నాణ్యత లోపాలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, అన్ని నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేయాలని, పనుల పురోగతిపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో భారతి, గృహ నిర్మాణ శాఖ ఏఈ లాల్ సాబ్, పంచాయతీ సెక్రటరీ విజయలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :