తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామానుజగూడెం గ్రామం లో మధ్యవర్తి ద్వారా రూ 30 వేలు లంచం తీసుకుంటు ఉండగా అటవీ శాఖ బీట్ అధికారి తో సహా ఇద్దర్ని ఏసీబీ డి ఎస్పీ వై రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫారెస్ట్ బీట్ అధికారి బానోత్ రవికుమార్, (కాచనపల్లి) ఇంచార్జి రామానుజ గూడెంలో పోడు రైతు భూమి నుండి ట్రెంచ్ కొట్టకుండా ఉండేందుకు రూ 30 వేలు డిమాండ్ చేశారు. ఆయన ఏజెంట్ సాదిక్ ఆయన ఇంటి వద్ద 30 వేలు లంచం తీసుకుంటు ఉండగా ఖమ్మం రేంజ్ ఏసీబీడి ఎస్పీ వై. రమేష్ నేడు దాడి చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖలో ఇది నాలుగో అవినీతి కేసు.
Admin
తెలుగు వెలుగు టీవీ