Wednesday, 16 September 2026 11:26:38 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

జిల్లా ఆరోగ్య సేవలపై సిఆర్ఎం బృందం సమీక్ష - జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బృందం

Date : 06 November 2025 05:24 PM Views : 361

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సిఆర్ఎం (కామన్ రివ్యూ మిషన్) బృందం జిల్లా ఆరోగ్య కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లా ఆరోగ్య వ్యవస్థ, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, వైద్య సిబ్బంది పనితీరు, మరియు ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా సిఆర్ఎం బృంద సభ్యులు డా. గురిందర్ బీర్ సింగ్ – అడ్వైజర్ CPC PHC NHSRC మాట్లాడుతూ, జిల్లాలో చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలు, ముఖ్యంగా మాతా–శిశు ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ, గ్రామీణ ఆరగ్య సేవల విస్తరణ, మరియు వైద్య సదుపాయాల మెరుగుదలపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని ఆరోగ్య సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తున్నారని, ఆరోగ్య సేవల నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని బృందం అభిప్రాయపడింది. సిఆర్ఎం బృందం జిల్లాలో ఐదు రోజులపాటు పర్యటించి, జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి (GGH) కొత్తగూడెం, MCH ఈ.రామవరం, ఏరియా ఆసుపత్రి భద్రాచలం, సిహెచ్ సి చర్ల, ఇల్లందు, గుండాల, ఎస్ఎన్‌పురం, సుజాతనగర్, యుపిహెచ్ సి శేఖర్ బంజరా, రామవరం, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ లు లచ్చగూడెం, ముత్తాపురం, నమిడిగూడెం, ధన్బాద్, చాతకొండ, తెగడ, దానవాయిపేట తదితర ఆరోగ్య కేంద్రాలు, అలాగే టీ హబ్ కొత్తగూడెం, సెంట్రల్ మెడిసిన్ స్టోర్, క్రిటికల్ కేర్ బ్లాక్ కొత్తగూడెం కేంద్రాలను సందర్శించి ఆరోగ్య సేవలను పరిశీలించింది. బృంద సభ్యులు తమ పరిశీలన వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో వివరించారు. వైద్య సిబ్బందికి తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్ హెచ్పిలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ , సిఆర్ఎం బృందం చేసిన సూచనలను సత్వరమే అమలు చేయాలని, జిల్లా ఆరోగ్య సేవల నాణ్యతను మరింత బలోపేతం చేయడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపు, వైద్య సేవల సులభ ప్రాప్యత, మరియు అన్ని స్థాయిల్లో సమన్వయం కలిగి కార్యక్రమాలు అమలు చేయాలని ఆయన సూచించారు.జిల్లా ఆరోగ్య సిబ్బంది కృషితో జిల్లా ఆరోగ్య వ్యవస్థ మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా ఆరోగ్య పరిరక్షణలో కొత్త ప్రమాణాలు సాధించాలన్నదే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. సిఆర్ఎం బృందంలో, డా. బి. వెంకట శివారెడ్డి – అసిస్టెంట్ ప్రొఫెసర్ AIIMS మంగళగిరి, డా. అజయ్ పాండే – అసిస్టెంట్ ప్రొఫెసర్ PRC లక్నో, డా. అంకిత కాంకర్య – అసిస్టెంట్ ప్రొఫెసర్ PGIMER చండీగఢ్, డా. అనర్ సింగ్ డాకర్ – సీనియర్ కన్సల్టెంట్ NHM పాలసీ MoHFW, మరియు డా. కల్పనా భవానియ – సీనియర్ కన్సల్టెంట్ PHA NHSRC సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయలక్ష్మి, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సైదులు, డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ మధువరన్, డాక్టర్ పుల్లారెడ్డి, డాక్టర్ స్పందన, డాక్టర్ తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :