తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు చర్ల మండలంలోని ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన ఎర్రంపాడు గ్రామాన్ని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్ మరియు భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్ సందర్శించారు.CRPF 141Bn అసిస్టెంట్ కమాండెంట్ వివేక్ రంజన్,చర్ల సీఐ రాజు వర్మ మరియు ఇతర పోలీస్ అధికారులు,సిబ్బందితో కలిసి మావోయిస్ట్ ప్రభావిత గ్రామంలోని 250 కుటుంబాలను సందర్శించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ గ్రామ ప్రజలకు nestle కంపెనీ వారి సహకారంతో నిత్యావసర వస్తువులను అందించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సారథ్యంలో ఏజెన్సీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని,మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.ఇందులో భాగంగానే జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే అదీవాసీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వర్షాల అనంతరం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.డెంగీ,మలేరియా వంటి విషజ్వరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.అభివృద్ధి నిరోధకులైన నిషేదిత మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించవద్దని కోరారు.ప్రత్యక్షంగానైనా,పరోక్షంగానైనా మావోయిస్టులకు సహకరిస్తే,అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొనబడతాయని అన్నారు.మారుమూల ఏజెన్సీ ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించడానికి ముందుకొచ్చిన Nestle కంపెనీ వారికి ఈ సందర్బంగా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ