తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 9 తెలుగు వెలుగు ) జూలూరుపాడు మండల కేంద్రంలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని కొమరం భీం ఫౌండేషన్ ఆద్వర్యంలో మండల కేంద్రంలో ఆదివాసులు ర్యాలీ నిర్వహించార. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సామాజిక సమరసత తెలంగాణ కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలవేసి ఆదివాసి జెండా ఆవిష్కరించడం జరిగింది .అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ సభ నిర్వహించి ఆదివాసి ఆడబిడ్డలతో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ అమెరికా, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్, కెనడా దేశాలలో పకృతితో మమేకమై జీవిస్తున్న సుమారు 7 లక్షల 50వేల మంది ఆదివాసీ ప్రజలను విష ప్రయోగాలతో సామూహిక మారణకాండ జరిపి హత్య చేశారని , మిగిత అనేక పాశ్చాత్య దేశాలలో అభివృద్ధి పేరిట ఆదివాసుల పై మారణకాండ జరిపారని ఆదివాసులను కేవలం రెండవ తరగతి ప్రజలుగా చూశారని ఇలాంటి దుశ్చర్యలపై ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఆదివాసులు చేసిన పోరాటాల ఫలితంగా ఆగస్టు 9వ తేదీని ప్రపంచ ఆదివాసి దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని అన్నారు. ఆదివాసి దినోత్సవం అంటే కేవలం ఆదివాసులు జరుపుకునే పండగ కాదని ఆదివాసులు ఇచ్చినటువంటి సంస్కృతి ఆదివాసులు ఇచ్చినటువంటి అడువులు, స్వచ్ఛమైన నీరు అనుభవిస్తున్న ప్రజలందరూ జరుపుకోవాల్సిన పండగ అని అన్నారు. జల్ జంగల్ జమీన్ ఇది రాజకీయ నినాదం కాదని ఎక్కడైతే భూమి పచ్చగా ఉంటుందో, ఎక్కడైతే అడవి శాతం ఎక్కువగా ఉంటుందో , ఎక్కడైతే స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుందో అక్కడ నివసించే ప్రజలు మరియు పశుపక్షాదులు సుభిక్షంగా ఉంటాయని ప్రపంచానికి చాటు చెప్పిన వారు ఆదివాసి బిడ్డలు అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేసి గ్రామపంచాయతీలో పిసా చట్టం అమలు కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలి అని డిమాండ్ చేశారు.ఆదివాసీలు అంటే ప్రభుత్వ ఆఫీసులో ఎమ్మార్వో ఆఫీసు, పోలీస్ స్టేషన్లో, ఎక్కడ కూడా విలువ ఇవ్వడం లేదు వారికి గౌరవం కల్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలి అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల నుండి ఐటీడీఏ నుండి వచ్చే పథకాలు ఏమేమిటో ఆదివాసీలకు తెలియటం లేదు కాబట్టి పథకాలపై వారికి అవగాహన కల్పించాలి అని అలాగే పోడు భూములలో ప్రభుత్వ నుండి బోర్లు వెయ్యాలి అని కోరారు.ఆదివాసి ఇలవేల్పుల జాతర్ల అప్పుడు జాతరకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే జాతరకయ్యే ఖర్చులు భరించాలన్నారు ప్రతి ఆదివాసి గ్రామాలలో ఆదివాసీలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరారు.కార్యక్రమ అనంతరం వివిధ గ్రామ పెద్దలకు , ఆదివాసి పూజారులకు సన్మానం చేయడం జరిగింది.ఈకార్యక్రమంలోఆదివాసి నాయకులు తెల్లం నరసింహ రావు, యదలపల్లి వీరభద్రం మాజీ వైస్ ఎంపీపీ , కొడం సీత కుమారి మాజి వైస్ ఎంపిపి , యదలపల్లి కళశ్రీ మాజి సర్పంచ్ , తాటి రోహిణి , బచ్చల రేణుక, పూనం సూరయ్య , తెల్లంమహేష్ , వూకే వీరభద్రం , బచ్చల రాంబాబు, కల్తీ రామయ్య , యదలపల్లి వీరస్వామి , సోడె రోశయ్య ,సోడే శ్రీరాములు, సిద్ధబోయిన రామ్మూర్తి, సిద్ధబోయిన పుల్లారావు, సిద్దబోయిన మోహన్ , ఇర్పా రామారావు, కాలం నరసింహా రావు, మడి రవి, కొర్సా రమేష్ , సంఘం నాగరాజు , బచ్చల అశోక్ ,వర్షా చంద్రయ్య సామాజిక సమరసత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర జైపాల్, జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ మరియు గ్రామ పెద్దలు, యువత, ఉద్యోగస్తులు, మహిళలు, గిరిజన పూజారులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ