Monday, 02 November 2026 10:04:20 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 06 April 2026 01:48 PM Views : 583

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : సోమవారం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను, విభాగాల పనితీరును సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మొదటగా ఇన్‌పేషెంట్ వార్డును సందర్శించిన కలెక్టర్, అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స, వైద్య సిబ్బంది స్పందనపై వివరాలు తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఔట్‌పేషెంట్ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక వృద్ధుడు తనకు ఎవరూ లేరని, ప్రమాదంలో కాలు కోల్పోయినట్లు తెలియజేస్తూ సహాయం కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆ వృద్ధుడి పూర్తి వివరాలు సేకరించి, కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి అవసరమైన మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్‌పేషెంట్ విభాగంలో వడదెబ్బ కేసులు నమోదవుతున్నట్లు గుర్తించిన కలెక్టర్, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలలో భాగంగా మండల పరిధిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎంపీడీవోకు ఆదేశించారు. ఇప్పటికే ఆలస్యమైనందుకు కారణాలు అడిగి తెలుసుకుని, తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి లో ఔషధ నిల్వ గదిని సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, స్టాక్ రిజిస్టర్‌లో నమోదైన ఔషధాల వివరాలు మరియు వాస్తవ నిల్వలను సరిపోల్చి పరిశీలించారు. ఔషధాల నిల్వలు సరిపడా ఉన్నాయా లేదా అనే విషయంపై అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న మందులు ఎంతో విలువైనవి అని , వాటిని పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని, బహిరంగ మార్కెట్లో విక్రయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను కూడా తనిఖీ చేసిన కలెక్టర్, విధుల్లో ఉన్న సిబ్బంది హాజరు, వారి బాధ్యతలు, సేవల సమయపాలనపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించే ముఖ్య కేంద్రాలని, ఇక్కడ అందించే సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రోగులకు సమయానుకూలంగా సేవలు అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే విధంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైన అన్ని ఔషధాలు, వైద్య పరికరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. వేసవి కాలంలో వడదెబ్బలు, నీరసం వంటి సమస్యలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అవసరమైన మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని,ప్రజలకు తగిన జాగ్రత్తలు సూచించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో తాళ్లూరి రవి, మెడికల్ అధికారి వెంకటేశ్వర్లు, స్టాఫ్ నర్స్, సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :