తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ... యువత చెడును విడనాడి భక్తి మార్గంలో పయనించడం ద్వారా అన్నదాన కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అన్నారు. సోమవారం లక్ష్మీ టాకీస్ ఏరియాలో బస్తీ యూత్, పెద్దలు మహిళల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి హోమ పూజా నిర్వహించారు.దానిలో భాగంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూత్, పెద్దలు, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో కులమాతాలకతీతంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. యువత పెడదారిని పట్టకుండా భక్తి మార్గాన్ని అనుసరించి తోటి వారికి సహాయపడే విధంగా జీవనం కొనసాగించాలని యువతకు సూచించారు. పూజాఫలంగా అమ్మవారి కృపాకటాక్షాలు ఈ ప్రాంత వాసులపై ఎల్లవేళలా ఉండి యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో అవకాశాలు కలిగే విధంగా ప్రజలను దీవించాలని ఈ సందర్భంగా కార్పొరేటర్ మునిగడప పద్మ అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు చెనిగరపు నరేష్, జిత్తుక దిలీప్, శ్రీకాంత్, కడలి మహేష్,,రాజేశ్వరావు అశోక్,,లగ్గాల వంశీ, రాజు, మని, సదానందం, భానోత్ చందర్, గుగులోత్ శంకర్, వంశీ, బన్సీలాల్,.మహిళలు సునీత,సౌమ్యశ్రీ అనసూయ, బానోతు జానకి,స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ