తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజ్ ఆదేశానుసారం జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల లో భాగంగా సీఐ శ్రీలక్ష్మి స్థానిక ఎస్సై రవితో కలిసి జూలూరుపాడు ప్రధాన రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీలక్ష్మి, ఎస్సై రవి మాట్లాడుతూ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలు అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టుతున్నాయని తెలిపారు. ఇది కేవలం గణాంకాల అంశం కాదని, సమాజంగా మనందరి బాధ్యతగా భావించి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, ముఖ్యంగా యువత, ద్విచక్ర వాహన ప్రమాదాలలో ఎక్కువగా గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో రోడ్డు భద్రతపై సమగ్ర దృష్టి సారించడం అత్యంత అవసరమని తెలిపారు. బైక్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ ని అందరూ తప్పక పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని పలు రకాల సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పోలీసులతోపాటు వాహనదారులు ఉన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ