Monday, 02 November 2026 06:15:23 PM
# అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ. 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం సహించేది లేదు: కలెక్టర్ అంకిత్. # భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం.రక్తదానం ప్రాణదానంతో సమానం – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # జీవో నెంబర్ 76 లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

పట్టణంలో రహదారుల ఆధునీకరణే లక్ష్యం : కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 07 October 2026 05:22 PM Views : 201

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గత పాలకుల నిర్లక్ష్యంతోనే రాకపోకలకు కష్టాలు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. నూతన కమ్యూనిటీ హాల్‌ను సద్వినియోగం చేసుకోవాలి. మౌలిక వసతుల కల్పనకు నిరంతర కృషి. కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పట్టణంలో రహదారుల ఆధునీకరణను వేగవంతంగా పూర్తి చేయడమే ప్రధాన ఎజెండాగా లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. పాల్వంచ పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రధాన కూడలి అంబేద్కర్ సెంటర్ రోడ్లు పూర్తిగా ధ్వంసమై రాకపోకలు తీవ్ర ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో రూ 25లక్షలతో రోడ్ల అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పటైన సభలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ గత పాలకులు ప్రజా అవసరాలను, మౌలిక సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా పాలన సాగించడం వల్లే ప్రధాన రహదారులు గుంతలమయమై ఇలాంటి దుస్థితి దాపురించిందని విమర్శించారు. నిత్యం రద్దీగా ఉండే అంబేద్కర్ సెంటర్ మార్గంలో ప్రజలు, వాహనదారులు పడుతున్న అవస్థలను గుర్తించి తక్షణమే రోడ్ల పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. చేపట్టిన రహదారి నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా పక్కాగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం నవభారత్ సీఎస్ఆర్ నిధులతో శేఖరం బంజరలో రూ 27లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం నూతనంగా అందుబాటులోకి వచ్చిన కమ్యూనిటీ హాల్‌ను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గ పరిధిలో నిరంతరం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, కార్పొరేషన్ కమిషనర్ కె సుజాత, నవభారత అధికారులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, మూర్తి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు గుర్రం వెంకటేశ్వర్లు, గొర్లె అన్నపూర్ణ, బండి నరసింహ, కాల్వ భాస్కర్, గుణచరిత, బాలు నాయక్, కాంగ్రెస్ నాయకులు మహీపతి రామలింగం, టీడీపీ నాయకులు కనగాల అనంతరములు, సీపీఐ నాయకులు నిమ్మల రాంబాబు, డి సుధాకర్, శనగారపు శ్రీనివాసరావు, గొర్లె నరేష్, నామ పండు, నూనావత్ దినేష్, వాడే లక్ష్మి, వజ్జ రాజేశ్వరి, md యూసుఫ్, సత్యనారాయణ చారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :