Monday, 02 November 2026 07:00:20 PM
# పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్. # బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

అనారోగ్య కార్మికులకు అన్యాయం చేయొద్దు : ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

Date : 07 October 2026 05:29 PM Views : 345

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 1,800 మంది కార్మికులకు అన్‌ఫిట్ కోసం ఎదురుచూపులు. రీ-మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి: ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్. సింగరేణి సంస్థలో నిర్వహిస్తున్న కార్పొరేట్ మెడికల్ బోర్డు విధానాన్ని యాజమాన్యం పునఃసమీక్షించాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించలేని కార్మికులకు వైద్యపరమైన న్యాయం చేయాలని బుధవారం ఒక ప్రకటనలో ఆయన కోరారు.అన్‌ఫిట్ నిర్ధారణ ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ, అర్హులైన కార్మికులకు నిబంధనల ప్రకారం న్యాయం చేయాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.సింగరేణిలో ఇటీవల నిర్వహించిన కార్పొరేట్ మెడికల్ బోర్డుల్లో అన్‌ఫిట్‌గా నిర్ధారణ అవుతున్న కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని కొరిమి రాజ్ కుమార్ పేర్కొన్నారు. గత మెడికల్ బోర్డుల్లో వరుసగా సుమారు 4 శాతం, 14 శాతం, 10 శాతం మాత్రమే కార్మికులు అన్‌ఫిట్‌గా నిర్ధారణ అయిన పరిస్థితిపై యాజమాన్యం సమగ్ర సమీక్ష నిర్వహించాలని కోరారు.గుండె సంబంధిత సమస్యలతో స్టెంట్లు వేయించుకున్న కార్మికులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు, శారీరకంగా కఠినమైన విధులు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్న కార్మికులు సైతం అన్‌ఫిట్‌గా నిర్ధారణ కాకపోవడం విచారకరమన్నారు.కార్మికుల వాస్తవ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే నాలుగుసార్లు మెడికల్ బోర్డులు నిర్వహించిన నేపథ్యంలో, తీవ్ర అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించలేని కార్మికులను గుర్తించేందుకు ప్రత్యేకంగా రీ-మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యపరంగా అర్హులైన వారిని నిబంధనల ప్రకారం అన్‌ఫిట్‌గా నిర్ధారించాలని కోరారు.మెడికల్ బోర్డు నిర్ణయాలు కేవలం హైదరాబాద్ నుంచి వచ్చే వైద్యుల అభిప్రాయాలకే పరిమితం కాకూడదని కొరిమి రాజ్ కుమార్ సూచించారు. కార్మికుల వాస్తవ ఆరోగ్య పరిస్థితి, వారు నిర్వహిస్తున్న విధుల స్వభావం, శారీరక సామర్థ్యం, వైద్య నివేదికలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను సమగ్రంగా పరిశీలించాలన్నారు.మెడికల్ బోర్డుల నిర్వహణలో ఏకరీతి విధానం, పారదర్శకత, వైద్యపరమైన న్యాయం ఉండాలని స్పష్టం చేశారు.ప్రస్తుతం సుమారు 1,800 మంది కార్మికులు అన్‌ఫిట్ కోసం ఎదురుచూస్తున్నారని ఏఐటీయూసీ పేర్కొంది. వీరిలో అనేక మంది అనారోగ్య కారణాలతో సాధారణ విధులు నిర్వహించలేక, కుటుంబాలను పోషించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. గతంలో అమలు చేసిన మెడికల్ బోర్డు విధానాలను పునఃపరిశీలించి, అర్హులైన ప్రతి కార్మికుడికి నిబంధనల ప్రకారం అన్‌ఫిట్ సర్టిఫికేషన్ లభించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని కొరిమి రాజ్ కుమార్ కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :