Thursday, 17 September 2026 11:58:20 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

జాతీయ వర్క్‌షాప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 18 September 2025 07:51 PM Views : 501

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు న్యూ ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్, ప్రవాసీ భారతీయ కేంద్రం, మాల్చా లో నిర్వహించిన “అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మరియు బ్లాక్స్ ప్రోగ్రాం (ADP-ABP 2.0) భవిష్యత్ దిశ” వర్క్‌షాప్-కమ్-మీటింగ్ కు హాజరయ్యారు. NITI Aayog ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల ప్లానింగ్ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఆకాంక్షిత జిల్లా మరియు ఆకాంక్షిత మండల ప్రోగ్రామ్‌లలో భాగంగా ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, ప్రాథమిక సదుపాయాలు వంటి రంగాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఈ పురోగతిని సాధించటానికి ఎదుర్కొన్న సవాళ్లను చర్చించి, భవిష్యత్ దశల్లో కీలకమైన అభివృద్ధి సూచికలను సంపూర్ణంగా సాధించటానికి అవసరమైన చర్యలను పరిశీలించారు. రాష్ట్రాల ప్రాధాన్యతలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం, ఎదురయ్యే అడ్డంకులు, కావలసిన నూతన విధానాలపై కూడా చర్చలు జరిగాయి. అదేవిధంగా, ఏప్రిల్ 2026 నుండి అమలులోకి రానున్న ADP, ABP 2.0 కార్యక్రమాల రూపకల్పన పై సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆకాంక్షిత జిల్లా మరియు ఆకాంక్షిత మండల ప్రోగ్రామ్‌లలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అనుభవాలను పంచుకున్నారు. అలాగే, తదుపరి దశల్లో జిల్లాకు అవసరమైన ప్రాధాన్యతా అంశాలను వివరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :