Sunday, 02 August 2026 02:34:24 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సెంట్రల్ మెడికల్ స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 11 September 2025 07:03 PM Views : 596

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం మాత శిశు ఆరోగ్య కేంద్రంలోని సెంట్రల్ మెడికల్ స్టోర్ ను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టోర్‌లో నిల్వ ఉంచిన ఔషధాల లభ్యత, నాణ్యత, గడువు తేది, ఆసుపత్రులకు సరఫరా ప్రక్రియలను పరిశీలించారు. రోగులకు అవసరమయ్యే ఔషధాలు ఎల్లప్పుడూ సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, గడువు ముగిసిన మందులను తక్షణమే తొలగించి రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. తనిఖీ సందర్భంగా సెంట్రల్ మెడికల్ స్టోర్ సిబ్బంది కలెక్టర్ దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. ప్రధాన రహదారి నుండి స్టోర్‌కు వచ్చే రహదారి మరమ్మత్తులు చేయాలని, స్టోర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మందుల నిల్వ రాకులు, బరువైన బాక్సులు ఎత్తడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చాలని కోరగా స్పందించిన కలెక్టర్ అవసరమైన అన్ని సదుపాయాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్టోర్‌లోని ఒక హాల్ ఫ్లోరింగ్ పనులు పెండింగ్లో ఉన్న విషయాన్ని ఆయన గమనించారు. ఈ పనులను పూర్తిచేయడానికి అవసరమైన వ్యయంపై తక్షణమే నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించి, ఫ్లోరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాడుకలోకి తేవాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మెడికల్ స్టోర్ల సమర్థవంతమైన నిర్వహణ అత్యంత కీలకమని, అవసరమైన సదుపాయాల కల్పనలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. మందులు కొరత రాకుండా సంబంధిత అధికారులు అవసరమైన ఇండెంట్లు సకాలంలో పంపించాలి, ప్రతి రోగికి అవసరమైన ఔషధాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రతి అధికారికి, సిబ్బందికి ప్రజా ఆరోగ్యం అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని, వైద్య రంగంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట సీనియర్ ఫార్మసీ అధికారి శారద, ఫార్మసిస్ట్ అధికారి రామచందర్, సెంట్రల్ మెడికల్ స్టోర్స్ సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :