Thursday, 17 September 2026 09:36:21 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఏటీసీ ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు - జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 08 September 2025 05:20 PM Views : 438

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వం కల్పించే అవకాశాలను యువత అందిపుచ్చుకొని తమ భవిష్యత్తును బలోపాతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టర్ మణుగూరు ప్రభుత్వ ఐటిఐ కళాశాల మరియు ఏటీసీ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీ భవన సముదాయాన్ని పరిశీలించారు. ఐటిఐ లను ఆధునీకరించే క్రమంలో ఏటీసీలను ఏర్పాటు చేశామని, వీటిలో శిక్షణ పొందిన విద్యార్థులకు పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఏటీసీ శిక్షణ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి వివిధ పరిశ్రమంలో ఉద్యోగ అవకాశాలను కల్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. విద్యార్థులు శిక్షణ కాలంలో కష్టపడి చదివి సంపూర్ణ నైపుణ్యాన్ని పొందాలని, వారికి కావలసిన పుస్తకాలను ఉచితంగా అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ఐటిఐ లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు పరికరాలు కల్పించాలని దానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి నివేదికలు అందజేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మణుగూరు తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ 11వ ఎన్ సి సి ఖమ్మం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్సిసి క్యాంపును సందర్శించారు. ఈరోజు ప్రారంభమైన ఈ ఎన్ సి సి క్యాంపు 17వ తారీఖు వరకు పది రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 700 మందితో ఈ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్యాంప్ కమాండెంట్ కల్నల్ సంజయ్ కుమార్ భద్ర, మరియు క్యాంప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ నవీన్ యాదవులను కలిసి క్యాంపు వివరాలు, శిక్షణ, శిక్షణానంతరం ఉద్యోగ అవకాశాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్యాంపు సజావుగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. క్యాంపు ప్రదేశంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్సిసి శిక్షణ ద్వారా క్రమశిక్షణ, నాయకత్వం మరియు దేశ సేవ వంటి విలువలు పెరుగుతాయన్నారు. జిల్లాలో రథం గుట్ట వంటి సహజ సౌందర్య ప్రదేశాలను ఎన్సిసి అడ్వెంచర్ క్యాంపులకు వినియోగించుకోవచ్చని, దీని ద్వారా జిల్లా పర్యాటక రంగంలో మరింత ప్రాధాన్యతను పొందుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీఓ వెంకటేశ్వరరావు ఐటిఐ సూపర్డెంట్ జ్యోతిరాణి, ఏటీవోలు జీ.వీ కృష్ణారావు, వేణుగోపాల్ మరియు ఏటీసీ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :