తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 76 జీవో అమలు చేసి అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటానికి ఫలితం లభించిందని బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ అన్నారు. ఈ అంశంపై అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ 76 జీవోను అమలు చేస్తామని, ఈ నెల చివరిలోపు అర్హులైన వారికి ఇంటి పట్టాలు అందిస్తామని హామీ ఇవ్వడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ, “ప్రజా సమస్య ఏదైనా బీజేపీ పార్టీ ప్రజల పక్షాన ముందుండి పోరాటం చేస్తుందని,76 జీవో అమలు కోసం బీజేపీ చేసిన పోరాటం వల్ల ప్రభుత్వం స్పందించి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం ప్రజా పోరాట విజయానికి నిదర్శనం” అని అన్నారు. ఇంటి పట్టాల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నెల చివరిలోపు పట్టాలు అందించాలని ఇంకా పట్టా కోసం దరఖాస్తు చేసుకునే అటువంటి వారికి మరొక అవకాశం కల్పిస్తూ ఈ యొక్క ప్రక్రియలో స్థానిక ప్రజా ప్రతినిధుల చేతివాటం లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అర్హులైన వారు నష్టపోకుండా ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నోముల రమేష్, ఆదిముల రాములు, కనుకుంట్ల రాజమొగిలి, కొత్తూరు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శులు కలంకార్ రాజశేఖర్, చంద్రగిరి రమేష్, పట్టణ నాయకులు భాస్కర్ గౌడ్, గిరి, హృదయ్, రాజేష్, లలిత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ