Monday, 03 August 2026 04:59:33 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 06 June 2026 11:22 AM Views : 279

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో భూభారతి, సాదా బైనామా, ఇతర భూసేకరణకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలసి అశ్వాపురం, మణుగూరు, పినపాక, అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండలాల వారీగా భూభారతి దరఖాస్తులు, సాదా బైనామా కేసులు, భూసేకరణ అంశాల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిశీలనలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. మ్యూటేషన్లు, వారసత్వ హక్కుల నమోదు, ఇతర రెవెన్యూ సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణ అంశాలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని, పరిహారం చెల్లింపులు, భూ స్వాధీనం ప్రక్రియలో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడం ప్రతి అధికారి బాధ్యత అని అన్నారు .ఈ సమావేశంలో సంబంధిత తహసీల్దార్లు, గిర్దావర్లు, సర్వేయర్లు, కలెక్టరేట్‌కు చెందిన సంబంధిత శాఖల సూపరింటెండెంట్లు పాల్గొని మండలాల వారీగా వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. వివిధ భూ సంబంధిత అంశాలపై చర్చించి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :