Monday, 03 August 2026 04:29:20 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా

Date : 18 June 2026 04:52 PM Views : 69

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ ప్రాజెక్టు, లక్ష్మీదేవిపల్లి సెక్టార్, ఇంద్రానగర్ అంగన్వాడి కేంద్రం నందు "అమ్మమాట అంగనవాడి బాట" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారిని జె.స్వర్ణలత లేనినా మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో నమోదు అయ్యే లబ్ధిదారులకు పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని, ఈ యొక్క "అమ్మ మాట అంగనవాడి బాట" కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించి లబ్ధిదారుల సంఖ్య పెరిగే విధంగా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కృషి చేయాలని తెలిపారు. మొదటి 1000 రోజుల తల్లి బిడ్డల సంరక్షణ ధ్యేయంగా ప్రతి అంగనవాడి కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్య, ఆటపాటలతో కూడిన విద్యను అందించడం, అంగన్వాడి కేంద్రాలలో పెరటి తోట పెంపకం ద్వారా వచ్చే రాబడిని నమోదైన లబ్ధిదారులకు అందజేయాలని, జిల్లాలో ఏ ఒక్క అంగన్వాడి కేంద్రాలలో తీవ్ర పోషణ లోపం, అతి తీవ్ర పోషణ లోపంతో బాధపడే వారి సంఖ్య తగ్గించే వరకు అంగనవాడి టీచర్లు అహర్నిశలు కష్టపడాలని, ప్రతి నెల క్రమం తప్పకుండా పిల్లల ఎత్తు బరువులు చూచి వారి ఆరోగ్య సంరక్షణ కోసమై వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి భాగస్వాములు కావాలని కోరారు. ఈ అమ్మ మాట అంగనవాడి బాట కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ అధికారిని మరియు స్థానిక సర్పంచ్ ద్వారా లక్ష్మీదేవిపల్లి సెక్టర్ లో అంగన్వాడీ కేంద్రాలలో నమోదైన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం తో పాటు, నాణ్యతతో కూడిన యూనిఫామ్లు, విద్యారంభం సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్వంచ ప్రాజెక్టు సిడిపిఓ లక్ష్మీప్రసన్న, శ్రీనగర్ పంచాయతీ సర్పంచ్ రాణి, లక్ష్మీదేవిపల్లి సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ జిల్లా సమన్వయకర్త సంపత్, మహిళా సాధికారిత జిల్లా కోఆర్డినేటర్ రూప సంతోషి, అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :