తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అఖిల భారత విద్యార్థి సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఈరోజు విద్యార్థులతో కలిసి కరపత్రాలు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాడు దేశ స్వతంత్రం కోసం అనంతరం విద్యారంగ సమస్యల కోసం నూతన శాస్త్రీయ విద్య విధానం కోసం, చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నినాదంతో అలుపెరుగని పోరాటాలు చేస్తూ వచ్చిన సంఘం ఏఐఎస్ఎఫ్ అని ,1936 నుండి దేశ స్వతంత్రం కోసం చురుకైన పాత్ర వహించి స్వతంత్రం అనంతరం ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కలిగినటువంటి చదువును కల్పించాలని ఉద్యమాలు నిర్మించిన సంఘం ఏఐఎస్ఎఫ్ సంఘం అని వారు అన్నారు ఈనెల జూలై మూడవ తారీకు పాల్వంచలోని చండ్ర రాజేశ్వరరావు భవన్ నందు నిర్వహించుకుంటున్న అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 4వ మహాసభను జయప్రదం చేయాలని, అన్ని మండలాల నుండి విద్యార్థులు స్వచ్ఛందంగా తరలి రావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అజిత్, కొత్తగూడం పట్టణ కార్యదర్శి రణధీర్, కమల్, శివ, విజయ్ కాంత్, మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ