తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా అనూష. ఉత్తర్వులు విడుదల చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా జిల్లా పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గ్రూప్ - 1 అధికారిణి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నిర్వహించిన సమావేశంలో పర్యాటక రంగం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో భద్రాద్రి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం అనుష ను నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి, ప్రణాళికలు రూపొందించి, వాటి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తూ పర్యాటక అభివృద్ధికి నోడల్ అధికారి పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.ప్రస్తుతం పర్యాటక అధికారిగా ఉన్న పరాధామ రెడ్డి జిల్లా యువజన, క్రీడల.అధికారిగా కొనసాగనున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ