Wednesday, 04 November 2026 05:07:21 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్.

Date : 06 November 2024 07:07 PM Views : 617

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నాచారం, గుండుగులపల్లి, దమ్మపేట గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేపట్టాలనిఅధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ధాన్యం రవాణా విషయంలో లారీల కొరత లేకుండా చూడాలని, ధాన్యం ఎక్కువగా వచ్చే సెంటర్లో ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోలు చేపట్టాలని సూచించారు. అనంతరం దమ్మపేట మండలం ఆళ్లపల్లి గ్రామంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారుల సమన్వయంతో రాష్ట్ర సరిహద్దుల ద్వారా వరి ధాన్యం అక్రమ రవాణా కాకుండా పటిష్టమైన బందోబస్తు చేపట్టాలని, విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఎం సివిల్ సప్లై బాబు, డి సి ఓ ఖుర్షీద్, దమ్మపేట తాసిల్దార్ నవీన్మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :