Monday, 02 November 2026 11:47:35 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

పేదల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సంక్షేమ పథకాల అమలు : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 02 May 2026 06:14 PM Views : 342

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వ సాయం కొండంత అండ పేదల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం చుంచుపల్లి మండలంలోని కమ్మ సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సుమారు రూ. 6.22 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వ సాయం కొండంత అండగా నిలుస్తోందని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 86 మందికి రూ. 86.09 లక్షల విలువైన చెక్కులను అందజేశామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల రుణాలతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆకాంక్షిస్తూ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 49 సంఘాలకు రూ. 5.25 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. నిరుపేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక గొప్ప భరోసా అని, నియోజకవర్గంలోని 72 మంది బాధితులకు రూ. 35 లక్షల విలువైన వైద్య సహాయం మంజూరైందని వివరించారు. ప్రతి గడపకూ ప్రభుత్వ ఫలాలు అందడమే నిజమైన అభివృద్ధి అని, అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకుండా పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నిధులను మంజూరు చేస్తోందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి పేదవాడి కష్టంలో పాలుపంచుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డిఓ మధు కమిషనర్ సుజాత సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, మండల అధికారులు పుల్లయ్య, సుభాషిణి, నాగరాజు, కార్పొరేటర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :