Friday, 18 September 2026 02:05:24 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Date : 02 June 2026 12:54 PM Views : 122

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రజలకు, పోలీసు సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ అధికారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది మహనీయుల త్యాగాల ప్రతిరూపం అని వారి పోరాటాల, ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని,సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అదేవిధంగా సామాన్య ప్రజలకు న్యాయం చేకూరే విధంగా సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పతకాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్ రాజు వర్మ చర్ల పోలీస్ స్టేషన్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆపరేషన్స్ బి.రవి ఇరువురికి శౌర్య పతకాలు వచ్చిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలో కఠిన, ఉత్తమ సేవ, సేవ పతకాలు పొందిన వారికి కూడా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజనల్ డిఎస్పి ఆదినారాయణ, డిసిఆర్బి డీఎస్పీ మల్లేష్ స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :