తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ బార్‌లో ఇటీవల మద్యం మత్తులో కత్తులతో బెదిరింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది.ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, ప్రజల శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చట్టపరమైన చర్యల్లో భాగంగా సంబంధిత ముగ్గురు వ్యక్తులను బైండ్ ఓవర్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా కొత్తగూడెం 3 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం మత్తులో ఘర్షణలకు పాల్పడుతూ, కత్తులతో బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ