Wednesday, 16 September 2026 05:23:55 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 24 August 2026 07:01 PM Views : 467

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.గ్రేవ్, ప్రాపర్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి.బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పాల్వంచ డిఎస్పి ఆర్ సతీష్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌లోని వివిధ వర్టికల్స్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన UI కేసులు, గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసుల వివరాలను సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేసి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు.ప్రాపర్టీ, దొంగతనం కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు చోరీకి గురైన ఆస్తిని రికవరీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. కేసుల దర్యాప్తులో భాగంగా గత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న స్టేషన్ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల వివరాలను సక్రమంగా నమోదు చేసి, ఈ-సాక్ష్య, నాట్‌గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగాల పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పి ఆర్ సతీష్ కుమార్, సీఐ సతీష్, ఎస్సైలు ఎం ప్రసాద్, రామ్మూర్తి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :