Wednesday, 16 September 2026 06:59:04 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

యాంటీ డ్రగ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 26 June 2025 05:31 PM Views : 739

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి కొత్తగూడెం క్లబ్ వరకు భారీ ర్యాలీని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం కొత్తగూడెం క్లబ్ లో భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు మరియు స్థానికులను ఉద్దేశించి సమావేశాన్ని ఏర్పాటుచేసి మాదకద్రవ్యాల వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్,జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్,ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.అదేవిధంగా కొత్తగూడెం పట్టణ,పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా జిల్లా ఎస్పీ మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే చెడు పరిణామాలను గుర్తించాలని,గంజాయి,డ్రగ్స్ బారినపడి యువత తమ అమూల్యమైన జీవితాలను కోల్పోతున్నారని అన్నారు.యువత మంచి లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయలే కానీ డ్రగ్స్ కు బానిసలుగా మారకూడదని అన్నారు.ఈ అవగాహన కార్యక్రమాలను కేవలం యాంటీ డ్రగ్ డే వారోత్సవాలలో భాగంగా కాకుండా నిత్యం అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలిపారు.మన జిల్లాను మాదకద్రవి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భావితరాలకు డ్రగ్ ఫ్రీ సమాజాన్ని అందించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి వంటి ఇతర మాడా ద్రవ్యాలను వియ్రించినా, అక్రమ రవాణా చేసినా, వినియోగించినట్లు గుర్తించినట్లైతే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించవలసిందిగా సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లా గా మార్చడంలో కృషి చేస్తున్న మన జిల్లా పోలీసు శాఖ కృషి అభినందనీయం అని తెలిపారు.ఈ రోజు యాంటీ డ్రగ్ డే సందర్భంగా ర్యాలీకి హాజరైయన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు Say no to drugs… yes to life నినాధంతో ప్రతిజ్ఞ చేస్తూ.. మీ చుట్టూ ప్రక్కల ఉన్న వారికి అవగాహన కల్పించాలని అన్నారు.జిల్లా అధికారులుగా పనిచేస్తున్న మేము డ్రగ్స్ నకు సంబంధించి ఎలాంటి పరీక్షకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండి ఒక సరైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని సూచించారు.ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.గంజాయి లాంటి మహమ్మారినినిర్మూలించడంలో దేశంలోనే నెంబర్ వన్ గా మన జిల్లా నిలుస్తుందని ఈ సందర్బంగా గుర్తుచేశారు.ఎంతోమంది గంజాయి లాంటి డ్రగ్స్ మూలంగా తమ జీవితాలను కోల్పోకుండా జిల్లా ఎస్పీ గారి సారథ్యంలో పోలీస్ శాఖ చేస్తున్న కృషి అనిర్వచనీయం అని ప్రశంసించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్ గా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,ఎక్సైజ్ డిఎస్పీ కరంచంద్,బిల్లా సంక్షేమ అధికారిని లెనినా కుమారి, కొత్తగూడెం FDO కోటేశ్వరరావు,కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ అధికారులు,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :