Saturday, 19 September 2026 06:50:20 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ .

Date : 27 February 2026 08:13 PM Views : 465

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధి పడమట నర్సాపురం లోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో సేవాలాల్ 287వ జయంతి వేడుకలను అధికారికంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ జయంతి వేడుకలలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జయంతి వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యే కి ఆలయ కమిటీ స్వాగతం పలికారు అనంతరం సాంప్రదాయ బంజారా నృత్యంలో మహిళలలు ఆటపాటలతో అలరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సంత్ సేవాలాల్‌ మహారాజ్‌ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని అన్నారు. గిరిజ‌నుల‌కు ద‌శ‌-దిశ‌ను చూపి, హైందవ ధ‌ర్మం గొప్ప‌ద‌నం, విశిష్ట‌తల‌ను తెలియ‌ జేయడానికే సేవాలాల్ మ‌హారాజ్ జ‌న్మించారని చరిత్రకారులు చెబుతారని తెలిపారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్ర‌పంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని వెల్లడించారు. దీంతో శ్రీ సంత్‌ సేవాలాల్ ఇత‌ర కులాల వారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి, కాంగ్రెస్ నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, లచ్చు నాయక్, మహిళా అధ్యక్షురాలు ప్రియాంక, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లడి నరసింహారావు, నవీన్ రాథోడ్, మధుసూదనరావు, పొన్నెకంటి సతీష్ కుమార్, లేళ్ళ అప్పిరెడ్డి, కాజా రమేష్, లేళ్ళ గోపాలరెడ్డి రామిరెడ్డి, నాగ శ్రీనివాసరావు, ఆర్కె నాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ బాదావత్ వెంకట్ రామ్, మాన్ సింగ్, రాంకోటి, అధికారులు ఎంపీడీఓ అజయ్, ఏఓ దీపక్ ఆనంద్, ఆర్ఐ ఆదినారాయణ, సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై రవి, కార్యదర్శి బి హారిక తోపాటు, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, పార్టీ శ్రేణులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :