Thursday, 17 September 2026 12:54:56 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

U DISE లో వాస్తవ పరిస్థితికి అనుగుణంగా అప్డేట్ చేయించాల్సిన బాధ్యత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులదే. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Date : 27 October 2025 08:10 PM Views : 331

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు ZPHS ఆనందఖని లో ఉన్న జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో జరిగిన స్వచ్ & హరిత పాఠశాల రేటింగ్స్ (SHVR )మరియు U DISE+ 2025-26 శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, UDISE 2025_26 విద్యా సంవత్సరం కి సంబంధించి ప్రతి పాఠశాల ప్రొఫైల్ అప్డేషన్ ఈ నెల 31 తేదీ లోగా పూర్తి చేయాలని తెలియజేస్తూ, వీటికి సంబంధించి 100% U DISE వెరిఫై చేయాల్సిన బాధ్యత కాంప్లెక్స్ హెడమాస్టర్స్ ది మాత్రమే అన్నారు.U DISE లో రిపోర్టును సక్రమంగా ఎంటర్ చేయకపోవడం వల్ల మన జిల్లా PGI Rank తగ్గి పోతుందని అన్నారు.ముఖ్యంగా Electricity, Drinking water, Toilets, Ramp మొదలైనవి సరిగ్గా వెరిఫై చేసి, నమోదు చేయించాలని అన్నారు. Electricity, Drinking water facility లేకపోతే వెంటనే వాటిని Apply చేయించి, U DISE లో upload చేయించాలి.Toilets sanction అయిన పాఠశాలల U DISE లో toilet under construction స్టేజ్ లో ఉన్నట్లు అప్లోడ్ చేయించాలి.ఈ విషయాలన్నీ CRP మానిటర్ చేస్తూ, కాంప్లెక్స్ HM కు తెలియజేయాలి. FRS బాధ్యత కూడా కాంప్లెక్స్ HM మరియు CRP వహించాల్సి వస్తుందని అన్నారు.జిల్లా విద్యాధికారి బి.నాగలక్ష్మి మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో స్వచ్ఛ మరియు హరిత పాఠశాలల ఎంపిక లో భాగంగా 4 మరియు 5 స్టార్ గల్గిన 486 పాఠశాలలను గుర్తించి, వాటిని 90మంది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అసైన్ చేసి, సంబంధిత పాఠశాలలను ఈనెల 31వరకు మూల్యాంకనం చేసి SHVR వెబ్సైటు లో అంశాలన్నిటిని అప్లోడ్ చేయాలని సూచించారు.ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ మాట్లాడుతూ, ఇవాల్యుయేషన్ అనంతరం, జిల్లా స్థాయిలో మొత్తం 8పాఠశాలలను ఎంపిక చేసి, జిల్లా స్థాయిలో ఆయా పాఠశాలలకు అవార్డులను అందజేస్తామని జిల్లాట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ అన్నారు. UDISE ప్లస్ మరియు SHVR లను అనుభందం చేసి పాఠశాలలో ఏ ఏ సదుపాయాలు ఉన్నాయో వాటిని సరిగ్గా గుర్తించి పారదర్శకంగా రిపోర్ట్ ను వెబ్సైటు లో అప్లోడ్ చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు ఎస్.కె సైదులు, సతీష్ కుమార్, నాగరాజ శేఖర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ సంపత్ మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, CRP లు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :