తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు గత 25 సంవత్సరాల పైగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరియు ఆర్యవైశ్య సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలలో ముందుంటూ నడిపిస్తున్న చారుగుళ్ల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పదవి కాలం ముగిసినప్పటికీ వారి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండటం హర్షణీయం. దీనిలో భాగంగా ఈరోజు జూలూరుపాడు మండలం గుండేపూడి గ్రామ వాస్తవ్యులు మునగాల సాయి కిరణ్ కి, ప్రమాదం జరిగినప్పుడు అతను కోలుకునీ విధులలో చేరేవరకు ప్రతి నెల రూ 1,000 చొప్పున వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ తాజా మాజీ అధ్యక్షులు మరియు వారి టీం ద్వారా ప్రతి నెల అందజేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం లో భాగంగా (33వ) నెల అక్టోబర్ 2025 పెన్షన్ రూ 1,000 వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంయుక్త కార్యదర్శి మరియాల చంద్రమౌళి గుప్త చేతుల మీదుగా తెలంగాణా రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం ఉపాధ్యక్షులు మహంకాళి గోపాలకృష్ణ మరియు రాష్ట్ర పొలిటికల్ కో చైర్మన్ వందనపు సత్యనారాయణ మరియు జూలూరుపాడు పట్టణ అధ్యక్షులు శ్రీ ఉడతా వేణు గోపాలరావు సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా చంద్రమౌళి గుప్త మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకపోయినా శ్రీనివాస్ క్రమం తప్పకుండా ప్రతినెల పెన్షన్ ఇవ్వటంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం మాజీ చైర్మన్, కో చైర్మన్ ఉడతా నగేష్ కుమార్, సముద్రాల అనిల్ కుమార్ , జూలూరుపాడు మండల ఆర్యవైశ్య సీనియర్ నాయకులు పెండ్యాల క్రృష్ణమూర్తి, కంచర్ల రామారావు , పెండ్యాల నరేష్ , వేముల నాగేశ్వరరావు, అన్నవరపు జస్వంత్, కొదుమూరి కరుణాకర్ , అనుమళ్ల శ్రీనివాస రావు మరియు తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ