తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గం, పాల్వంచ మండలం, జగన్నాథపురం గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు అక్కడ ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్ సందర్శించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపతి ఆశీస్సులతో జగన్నాథపురం గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అత్యంత వైభవంగా మండపాన్ని ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ