Wednesday, 16 September 2026 11:24:22 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఐడిఓసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

Date : 05 September 2024 06:48 PM Views : 1111

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐడిఓసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు గౌరవ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరా చారి గారి ఆధ్వర్యంలో కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు గారి అధ్యక్షతన గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు తనకు గురువులుగా ఉన్న వారందరినీ పేరుపేరునా స్మరించుకుంటూ ఉపాధ్యాయుడు జాతీయ నిర్మాతలని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూనే ఎంపిక కాని వారందరినీ తనలాగే విద్యార్థులందరూ జ్ఞాపకం పెట్టుకుంటారని వారు కూడా ఉత్తమ ఉపాధ్యాయులేనని అన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒకటి నేర్చుకుంటామని వారు కూడా గురువులతో సమానమేనని ఉద్ఘాటించారు. నిత్యజీవితంలో ప్రతి విషయంలోనూ గురువులు ఉంటారని, ఏదో ఒక సరికొత్త విషయాన్ని నేర్చుకుంటూ తరగతి గదిలో విశిష్ట బోధన చేయాలని విద్యార్థుల హృదయాలలో గురువు యొక్క స్థానాన్ని పదిల పరుచుకోవాలన్నారు. తమ తల్లిదండ్రులు తనకు మొదటి గురువులను ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వివరించారు. ఈ కార్యక్రమ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు తన విజయాన్ని కోరుకున్నారని ఉపాధ్యాయులు అంటే తనకు ఎనలేని గౌరవమని అన్నారు. గురువులకు ఈ సమాజంలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. గతంలో గురువులు, విద్యార్థి బడికి రాని సందర్భంలో ఇంటికి వెళ్లి పట్టుకొచ్చే పరిస్థితుల నుండి ప్రస్తుతం విద్యార్థులను మందలించలేని స్థాయికి విద్యావ్యవస్థ మారిందని తెలియజేశారు. గురువులు ఇతర వ్యాపకాలు చేయకుండా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గురువులు సమాజసేవకులుగా ఉండి విద్యార్థుల క్రమశిక్షణలో పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ప్రగతి సాధించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు గారు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ వేణుగోపాల్ గారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ విద్యాచందన గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎం వెంకటేశ్వర చారి మాట్లాడుతూ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల నివేదికను సమర్పించారు. గడిచిన 2022, 2023 మరియు 2024 విద్యా సంవత్సరంలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక ఆయిన 100 మంది ఉపాధ్యాయులకు సన్మానం, ప్రశంసా పత్రం అందిస్తున్నట్లు తెలిపారు. వీరితోపాటు గత రెండు సంవత్సరాలలో రాష్ట్రస్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్ సతీష్ కుమార్ జిల్లా విద్యాశాఖ అకాడమీక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్ జిల్లా సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ షేక్ సైదులు జిల్లా బాలిక అభివృద్ధి అధికారి జే అన్నామణి ఏ సి జి ఈ మాధవరావు గారు, మీడియా ఇంచార్జి దస్తగిరి జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సన్మాన గ్రహీతలు పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో శ్రీ దుర్గసాయి నృత్యనికేతన్, అభినయ నృత్య నాట్యాలయం, కేజీబీవి పాల్వంచ విద్యార్థినులచే నృత్య కళ రూపాలు, నిర్వహించారు అవి చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారికి కలెక్టర్ గారి చేతుల మీదుగా మెమొంటోలు అందజేసి సత్కరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :