Sunday, 02 August 2026 02:27:15 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఆరోగ్యం క్షీణించి దంతెలబోర సిపిఐ సర్పంచి వెంకటరవణ మృతి. సర్పంచి కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే కూనంనేని.

Date : 25 July 2026 08:44 PM Views : 103

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆరోగ్యం క్షీణించి దంతెలబోర సిపిఐ సర్పంచి వెంకటరవణ మృతి. వెంకటరవణ మృతికి కూనంనేని, సాబీర్ పాషా సంతాపం. సర్పంచి కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే కూనంనేని. పాల్వంచ మండలం దంతెలబోర (ఎస్సీ కాలనీ) సిపిఐ పక్ష సర్పంచి సిడెం వెంకటరవణ (34) శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల కాలు గాయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు మొదట భద్రాచలంలోని మిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో భద్రాచలం వైద్యులు ఖమ్మంకు రిఫర్ చేశారు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. వెంకటరవణకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదట భద్రాచలంలో అందించిన వైద్యం వికటించడం వల్లే ఆమె మృతిచెందిందని భావించిన కుటుంబ సభ్యులు భద్రాచలం ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. అయితే, చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను వైద్య బృందం వారికి వివరించడంతో సంతృప్తి చెందిన కుటుంబ సభ్యులు నిరసనను విరమించుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఆమె స్వగ్రామమైన దంతెలబోరకు తరలించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందించిన వెంకటరవణ మృతిపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు వి. పూర్ణచందర్, అడుసుమిల్లి సాయిబాబు, యు. రాహుల్ తదితరులు తమ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రజాసేవలో ముందంజలో ఉన్న యువ నాయకురాలిని కోల్పోవడం తీరని లోటని, వెంకటరవణ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారుభరోసా ఇచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :